Fri Jan 30 2026 14:34:08 GMT+0000 (Coordinated Universal Time)
యాపిల్ కొత్త సీఓఓగా భారత సంతతి వ్యక్తి నియామకం
యాపిల్ సంస్థలో భారత సంతతికి చెందిన సబీ ఖాన్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

యాపిల్ సంస్థలో భారత సంతతికి చెందిన సబీ ఖాన్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. దాదాపు 30 ఏళ్లుగా యాపిల్‌లో పనిచేస్తున్న సబీ ఖాన్, ప్రస్తుత సీఓఓ జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆపరేషన్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సబీ ఖాన్, కంపెనీలో కీలకమైన గ్లోబల్ సప్లై చైన్‌ను దశాబ్దాలుగా పర్యవేక్షిస్తున్నారు. 2015 నుంచి సీఓఓగా పనిచేస్తున్న జెఫ్ విలియమ్స్, ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. పాఠశాల విద్య కోసం సింగపూర్‌కు, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1995లో యాపిల్‌లో చేరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.
Next Story

