Sun Dec 14 2025 02:01:21 GMT+0000 (Coordinated Universal Time)
బొద్దింకలతో ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.

ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. శాన్ఫ్రాన్సిస్కో-ముంబయి విమానంలోని ప్రయాణికులు బొద్దింకలతో సమస్యలను ఎదుర్కోవడంతో విమానయాన సంస్థ వివరణ ఇచ్చుకుంది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబయి బయల్దేరిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. చిన్న బొద్దింకల వల్ల వారు ఇబ్బందిపడ్డారని, మా సిబ్బంది వెంటనే స్పందించి, అదే క్యాబిన్లో వేరేచోట వారికి సీట్లు కేటాయించారని ఎయిర్ ఇండియా తెలిపింది. కోల్కతాలో ఇంధనం కోసం ల్యాండ్ అయిన సమయంలో బొద్దింకలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయించామని అధికారులు తెలిపారు. నిర్వహణపరంగా అంతా సక్రమంగానే ఉందని, గ్రౌండ్ ఆపరేషన్స్ సమయంలో కీటకాలు విమానంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని ఎయిరిండియా ప్రతినిధి వివరించారు.
News Summary - Air India with cockroaches
Next Story

