ఏఐ వీడియోలు అప్లోడ్ చేస్తూ మమ్మల్ని బాధపెడుతున్నారు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కోమి వ్యాస్‌తో పాటు ఆమె భర్త ప్రతీక్ జోషి, వారి ముగ్గురు పిల్లలు ప్రద్యుత్, నకుల్, మిరాయా మరణించారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కోమి వ్యాస్‌తో పాటు ఆమె భర్త ప్రతీక్ జోషి, వారి ముగ్గురు పిల్లలు ప్రద్యుత్, నకుల్, మిరాయా మరణించారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే, సోషల్ మీడియాలో కొందరు ఇన్ ఫ్లూయెన్సర్లు లైకులు, వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడానికి దారుణంగా వ్యవహరిస్తున్నారని కోమి వ్యాస్ బంధువులు ఆరోపించారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, నకిలీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్య ప్రచారాలు, ఏఐ వీడియోలతో తమను కుంగిపోయేలా చేయవద్దని కోరారు. కోమి విమానం ఎక్కే ముందు కుటుంబ సభ్యులతో తీసుకున్న సెల్ఫీ ఒకటి ఫ్యామిలీ గ్రూపులో పోస్ట్ చేశారని, అది ఇప్పుడు వైరల్ అయిందని కోమి వ్యాస్ బంధువులు తెలిపారు. ఆ ఫోటోను ఉపయోగించి కొందరు ఏఐ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని వాపోయారు.