Thu Mar 19 2026 07:03:57 GMT+0530 (India Standard Time)
విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోవాలి.. పోలీసులకు ఫిర్యాదు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నైజ హోరాటగారర వేదిక తరఫున ఏఎం.వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో విరాట్ కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
Next Story

