కూలిన విమానం.. ఆచూకీ చెప్పిన స్మార్ట్ వాచ్
స్మార్ట్ వాచ్ ల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా కాపాడాయని మనం తెలుసుకుంటూ ఉంటాం.

స్మార్ట్ వాచ్ ల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా కాపాడాయని మనం తెలుసుకుంటూ ఉంటాం. తాజాగా ఓ స్మార్ట్ వాచ్ విమానం ఆచూకీ తెలియజేసింది.
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఓ విమానం అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యం కావడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కనిపించకుండా పోయిన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, విమానంలో ప్రయాణించిన ముగ్గురిలో ఒకరి చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ సహాయంతో విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించారు. యెల్లోస్టోన్ జాతీయ పార్క్ సమీపంలో విమానం శకలాలు కనిపించాయి. వాచ్ సిగ్నల్ ఎక్కడ ఆగిపోయిందనే వివరాలతో విమానం కోసం గాలించగా, అరగంటలోపే ఆ సిగ్నల్ ఆధారంగా విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో పైలట్ సహా మొత్తం ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు.

