Sat Dec 06 2025 03:19:46 GMT+0000 (Coordinated Universal Time)
లారీపై 300 కి.మీ. ప్రయాణించిన నాగుపాము
లారీ క్యాబిన్లోకి ఎక్కిన ఏడడుగుల నాగుపాము 300 కిలోమీటర్లు ప్రయాణించింది.

లారీ క్యాబిన్లోకి ఎక్కిన ఏడడుగుల నాగుపాము 300 కిలోమీటర్లు ప్రయాణించింది. లారీ డ్రైవరు గమనించకపోయి ఉంటే ఇంకెన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఉండేదో!! ఎట్టకేలకు డ్రైవర్ వన్యప్రాణి విభాగం అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పట్టుకెళ్లారు. ఉత్తర్ ప్రదేశ్లోని గాజియాబాద్ నుంచి హరియాణాలోని అంబాలాకు లారీ వెళ్తోంది. అప్పుడప్పుడు శబ్దం వస్తూ ఉంటే.. అది లారీ వల్ల వచ్చిందని అనుకుంటూ వచ్చాడు డ్రైవర్. పాము బుస్ అని శబ్దం చేసినా అది టైరువల్లేనని డ్రైవరు భావించాడు. మధ్యలో టీ తాగడానికి ఆగి కిందకు వెళ్లి రాగా, డ్రైవరు సీట్లోకి నాగుపాము వచ్చింది. డ్రైవర్ యజమానికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత వన్యప్రాణి విభాగం అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ నాగుపామును పట్టుకోవడానికి సిబ్బందికి ఏకంగా ఒకటిన్నర గంటల సమయం పట్టింది.
Next Story

