Mon Mar 16 2026 20:54:39 GMT+0530 (India Standard Time)
బాలుడి కడుపులో 100 అయస్కాంతాలు!
న్యూజిలాండ్‌లో ఒక బాలుడి కడుపు లోంచి 100 అయస్కాంతాలను డాక్టర్లు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు.

న్యూజిలాండ్‌లో ఒక బాలుడి కడుపు లోంచి 100 అయస్కాంతాలను డాక్టర్లు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. 13 ఏండ్ల ఆ బాలుడు వాటిని ఆన్లైన్లో కొనుగోలు చేసి మింగేశాడు. కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌రే తీసి చూడగా
అతని కడుపులో అయస్కాంతాలు 80 నుంచి 100 వరకు ఉన్నట్టు గుర్తించారు. ఆయస్కాంతాలు అతడి పేగుల్లో, పెద్దపేగుల్లో చిక్కుకుపోయాయి. అయస్కాంతాల అమ్మకంపై 2013 నుంచి నిషేధం ఉన్నా ఓ సంస్థ వాటిని అమ్మేస్తోందని, ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story

