Thu Mar 19 2026 19:58:26 GMT+0530 (India Standard Time)
ఘోర్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లారం వద్ద లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లారం వద్ద లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని మల్లారం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు కరీంనగర్ వాసులుగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
భార్యాభర్తలతో పాటు....
కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగింది.
Next Story

