Mon Apr 21 2025 20:13:18 GMT+0000 (Coordinated Universal Time)
మెదక్ లో నేడు మల్లన్న కల్యాణం
ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి కల్యాణోత్సవం నేడు జరగనుంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి కల్యాణోత్సవం నేడు జరగనుంది. ప్రతి ఏడాది మల్లన్న కల్యాణాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి అంటే ప్రసిద్ది. ఈ ఆలయ అభివృద్ధికి మంత్రి హరీశ్ రావు అనేక ఏళ్లుగా కృషి చేస్తున్నారు.
పట్టువస్త్రాలు.....
మూడు రోజుల పాటు కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈరోజు కల్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. కల్యాణానికి మంత్రి హరీశ్ రావు హాజరుకానున్నారు. మల్లన్నకు ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాను సమర్పిస్తారు. వేల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కల్యాణం, బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
Next Story