Fri Dec 05 2025 12:03:47 GMT+0000 (Coordinated Universal Time)
Maharashtra Elections : ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు
శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు.

మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆధిక్యత కనపరుస్తుంది. అయితే శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాతీర్పు కాదని ఆయన అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలే మహాయుత కూటమిని గెలిపించాయన్న సంజయ్ రౌత్ దీనికి ప్రధాన కారణం మోదీ, అమిత్ షా అంటూ విమర్శలకు దిగారు.
ప్రజా తీర్పు కాదు...
ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని, ప్రజలు తమ వైపు ఉన్నప్పటికీ ఈవీఎంలను మేనేజ్ చేయడం వల్లనే మహారాష్ట్రలో ఇంతటి విజయాన్ని సాధించారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికలు జరిగే ప్రతి చోటా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందన్న ఆయన, బ్యాలట్ పద్దతి వల్లనే అసలైన ప్రజాస్వామ్యం ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందని తెలిపారు.
Next Story

