Tue Jan 20 2026 15:24:54 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ ప్రచారం చేసిన చోట విజయం ఎవరిదంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయన మహారాష్ట్రలోని అనేక చోట్ల ప్రచారం నిర్వహించారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయన మహారాష్ట్రలోని అనేక చోట్ల ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని రక్షించాలని, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కల్యాణ్ కోరారు. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న పవన్ కల్యాణ్ అక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈ ప్రాంతాల్లో...
పూణే, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ లలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పూణే, బల్లార్ పూర్, షోలాపూర్ లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. డెత్లూర్, లాతూర్ లలో మాత్రం ఒకింత హోరాహోరీ పోరు సాగుతుంది. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండటం విశేషంగానే చెప్పుకోవాలి.
Next Story

