Sun Feb 15 2026 15:38:54 GMT+0530 (India Standard Time)
Srisailam : శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
మహా శివరాత్రి సందర్భంగా నేడు శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు

మహా శివరాత్రి సందర్భంగా నేడు శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నేడు శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలుజరగనున్నాయి. దీంతో శివరాత్రి నాడు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తుల అధిక సంఖ్యలో రావడంతో శ్రీశైలం కిక్కిరిసిపోయింది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
తెల్లవారు జాము నుంచే
తెల్లవారు జాము నుంచే ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శివరాత్రి నాడు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని భావించి అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. ఈరోజు ఐదు గంటలకు స్వామి వారి అమ్మవార్లకు ప్రభోత్సవాన్నినిర్వహిస్తారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కూడా వాహనాలు అధికంగా రావడంతో నెమ్మదిగా సాగుతున్నాయి.
Next Story

