Sat Dec 13 2025 19:25:24 GMT+0000 (Coordinated Universal Time)
Maha Shivaratri : జాగరణ పూర్తయిన మరునాడు ఈ ఆహారం అస్సలు తినకండి
అయితే.. చాలామంది శివరాత్రి రోజున కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం..

మహా శివరాత్రి.. ఇదే శివుని యొక్క మహారాత్రి. ఆ పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు ఆ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసాలు, జాగరణ చేస్తారు. ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు నీటితో అభిషేకం చేసినా.. ఆనందిస్తాడని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజున భక్తులంతా పంచద్రవ్యాలతో అభిషేకిస్తారు. అలాగే.. మారేడు దళాలు, బిల్వపత్రాలతో అర్చన చేస్తారు.
అయితే.. చాలామంది శివరాత్రి రోజున కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. శివరాత్రి పర్వదినాన మద్యపానం, మాంసాహారం తినడం అంతమంచిది కాదు. అలాగే.. శివరాత్రి పూర్తయిన మరునాడు కూడా మాంసాహారం తినకూడదు. ముఖ్యంగా ఉపవాసం, జాగరణ చేసిన వారు ఈ నియమాన్ని పాటించాలి. ఈ ఏడాది శనివారం శివరాత్రి వచ్చింది. మరుసటిరోజు ఆదివారం. శివరాత్రి రోజంతా అన్నం ముట్టకుండా ఉపవాసం చేసి సాయంత్రం.. శివయ్య దర్శనానంతరం.. పాలు, పండ్లు తీసుకుంటారు.
మరుసటి రోజు ఉదయం ఇంట్లో దేవునికి దీపం పెట్టి పూజించిన తర్వాత.. శాకాహార భోజనం చేసి ఉపవాసాన్ని విడవాలి. అంతేకానీ శివరాత్రి అయిపోయింది కదా అని.. మాంసాహారం తింటే చేసిన ఉపవాస, జాగరణ ఫలితం దక్కదు.
Next Story

