Thu Mar 19 2026 02:51:25 GMT+0530 (India Standard Time)
సత్తెనపల్లిలో టెన్షన్ టెన్షన్
సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు కోడెల శివరాం ను పోలీసులు అరెస్ట్ చేశారు

సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు కోడెల శివరాం ను పోలీసులు అరెస్ట్ చేశారు. చలో మాచర్లకు కోడెల పిలుపునివ్వడంతో పోలీసులు ఆయనను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ నేతను మాచర్లకు పంపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కోడెల హౌస్ అరెస్ట్....
ఎవరు తమను అడ్డగించినా తాను మాచర్ల వెళ్లి తీరతానని కోడెల శివరాం పేర్కొన్నారు. మాచర్ల కార్యకర్తలకు సంఘీభావం తెలుపుతామని చెప్పారు. కోడెల శివరాం ఇంటి వద్ద భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్న మాచర్లలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో చలో మాచర్లకు కోడెల పిలుపునిచ్చారు.
Next Story

