Thu Mar 19 2026 01:26:45 GMT+0530 (India Standard Time)
రాజస్థాన్ రాయల్స్దే విజయం
తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు చేదు అనుభవం ఎదురయింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 72 పరుగుల తేడాతో ఓటమిపాలయింది

తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు హోం గ్రౌండ్లో చేదు అనుభవం ఎదురయింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 72 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 54 పరుగులు చేసి అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. యశస్వీ జైస్వాల్ సయితం 54 పరుగులు చేసి అండగా నిలవడంతో భారీ స్కోరు సాధ్యమమయింది.
భారీ లక్ష్యంతో...
తర్వాత బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదినుంచి తడబడుతూనే ఉంది. వరసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు పరాయజం పది ఓవర్లకే దాదాపు ఖరారయింది. చివర్లో ఉమ్రాన్ మాలిక్, సమద్లు సిక్సర్లతో మెరుపులు సృష్టించినా విజయానికి అల్లంత దూరంలో ఉండటంతో అది సాద్యం కాలేదు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి అపజయాన్ని మూటగట్టుకుంది.
Next Story

