Sun Dec 14 2025 11:32:40 GMT+0000 (Coordinated Universal Time)
ఫుల్లు లోడింగ్‌తో ఐపీఎల్ 2023
అట్టహాసంగా ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్జిత్ సింగ్ తన పాటలతో అలరించారు. తమన్నా, రష్మిక మందనా తమ డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప, RRR సినిమా పాటలకు రష్మిక మందన్నా, తమన్నా డ్యాన్స్ చేశారు. ఈ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు. దేశంలోనే అతి పెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకలతో నిండిపోయింది.
అట్టహాసంగా ప్రారంభం...
ప్రారంభం వేడుకలతో పాటు ఈరోజు ముఖ్యమైన మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే జరిగిన గత సీజన్లకు భిన్నంగా ఫుల్ లోడింగ్ తో ప్రారంభమయ్యాయి. మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల సమక్షంలో ఐపీఎల్ జరుగుతుంది. ఈరోజు నుంచి రెండు నెలల పాటు ఐపీఎల్ 2023 క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనుంది. మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Next Story

