Wed Mar 18 2026 22:25:51 GMT+0530 (India Standard Time)
IPL 2022 : ఇద్దరు హైదరాబాదీలకు ఐపీఎల్ లో చోటు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు మిలింద్ ఆనంద్ కు ఐపీఎల్ లో చోటు దక్కింది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు మిలింద్ ఆనంద్ కు ఐపీఎల్ లో చోటు దక్కింది. బెంగళూరు జట్టులో మిలింద్ ఆనంద్ స్థానం సంపాదించారు. మరో హైదరాబాదీ ఐపీఎల్ నుంచి ఎదిగేందుకు సిద్ధమవుతున్నారు. మిలింద్ ఆనంద్ విరాట్ కొహ్లి సారథ్యం వహిస్తున్న బెంగూళు జట్టులో స్థానం సంపాదించుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి.
తిలక్ వర్మకు కూడా....
మరో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా ఐపీఎల్ లో చోటు సంపాదించుకున్నారు. 1.70 కోట్లకు ముంబయి జట్టు కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ గా పేరున్న తిలక్ వర్మ క్రికెటర్ గా మరింత ఎదిగేందుకు ఈ ఐపీఎల్ సీజన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Next Story

