Tue Jan 14 2025 07:02:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్‌కు కీలకమే
ఈరోజు ఐపీఎల్ 2023లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీం మరో సవాల్‌ను ఎదుర్కొంటుంది.
ఈరోజు ఐపీఎల్ 2023లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీం మరో సవాల్‌ను ఎదుర్కొంటుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలయిన సన్‌రైజర్స్ కు ఈ మ్యాచ్ కీలకమనే చెప్పాలి. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు జరుగుతుంది. హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ టీంతో తలపడనుంది.
కసి మీద...
ఇప్పటికే పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి కసి మీదుంది. కానీ హైదరాబాద్ జట్టు మాత్రం వరస ఓటములతో ఇబ్బంది పడుతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలహీనంగా కనపడుతుంది. హోంగ్రౌండ్లోనైనా తొలి విజయం నమోదు చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లు పది రోజులకు ముందే హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయి.
Next Story