Thu Dec 18 2025 13:43:13 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ ఓటమి
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలయింది

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలయింది. జితేష్ శర్మ రాణించనా మిగిలిన బ్యాటర్లు ఎవరూ సహకరించకపోవడంతో మరో 15 బాల్స్ మిగిలి ఉండగానే పంజాబ్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. అందులో విరాట్ కొహ్లి, డూప్లిసెస్లు ఇద్దరూ అర్థ సెంచరీ పూర్తి చేశారు. 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి బెంగళూరు రాయల్స్ 174 పరుగులు చేయగలిగింది.
ఆదినుంచి
మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసి పంజాబ్ వెన్ను విరిచింది. దీంతో బెంగళూరుదే విజయం అయింది. పంజాబ్ కింగ్స్ ఆది నుంచి తడబడుతుంది. జితేష్ అప్పుడప్పుడు ఫోర్లు, సిక్సర్లు కొట్టడంతో కొంత ఆశలు రేకెత్తించినా చివరకు కింగ్స్ చేతులెత్తేసింది. జితేష్ శర్మ, ప్రభాసిమ్రాన్ లు ఇద్దరూ పోరాడి జట్టుకు విజయాన్ని అందించేందుకు ప్రయత్నించారు. కానీ ఇతర బ్యాటర్లు క్రీజులో నిలబడకపోవడంతో పంజాబ్ ఓటమిని మూటగట్టుకుంది.
Next Story

