Wed Mar 18 2026 17:41:01 GMT+0530 (India Standard Time)
ఓటమి అంచున ఉన్న జట్టును?
వరస విజయాలతో మంచి జోష్ మీదున్న రాజస్థాన్ రాయల్స్ కు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఝలక్ ఇచ్చింది.

వరస విజయాలతో మంచి జోష్ మీదున్న రాజస్థాన్ రాయల్స్ కు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఝలక్ ఇచ్చింది. ఒక దశలో రాజస్థాన్ రాయల్స్ దే విజయమనుకున్నారు. కీలక వికెట్లు కోల్పోయి రన్ రేటు అనూహ్యంగా పెరగడంతో రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో మరో గెలుపును జత చేసుకుంటుందని భావించారు. కానీ ఐపీఎల్ ఇది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా అదే జరిగింది.
ఆ ఇద్దరూ...
ఓటమి అంచున ఉన్న జట్టును సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్, షాబాజ్ లు విజయపథాన నిలబెట్టారు. 170 పరుగుల లక్ష్యాన్ని ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే బెంగుళూరు జట్టు ఛేదించింది. చివర వరకూ మ్యాచ్ ఉత్కంఠ రేపినా దినేష్ కార్తీక్, హర్ష పటేల్ లు మ్యాచ్ ను ముగించేశారు.
Next Story

