Thu Mar 19 2026 07:22:17 GMT+0530 (India Standard Time)
ఢిల్లీదే విజయం... టెన్షన్ మధ్య
క్రీజులో నిలిచిన అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ లు బ్యాట్ ను ఝుళిపించారు. అతి పెద్ద స్కోరును అవలీలగా ఛేదించగలిగారు

ఓడిపోతుందన్న మ్యాచ్ గెలుస్తే... ఆ ఉత్కంఠ ను వర్ణించలేం. ఢీల్లీ క్యాపిటల్స్ గెలుపు అదే. ముంబయి ఇండియన్స్ గెలుపు తధ్యమని అందరూ భావించారు. 178 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరసగా వికెట్లను చేజార్చుకుంది. పృధ్వీషా, సీఫెర్ట్, రిషబ్ పంత్ , ఆర్ పావెల్ ఇలా వరసగా అవుట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి ఖాయమనుకున్నారంతా.
ఆ ఇద్దరే.....
కానీ క్రీజులో నిలిచిన అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ లు బ్యాట్ ను ఝుళిపించారు. అతి పెద్ద స్కోరును అవలీలగా ఛేదించగలిగారు. అక్షర పటేల్ 38 పరుగులు, లలిత్ యాదవ్ 48 పరుగులు చేసి జట్టును విజయపథాన నిలిపారు. ఐదు సార్లు ట్రోఫిని చేజిక్కించుకున్న ముంబయి క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో ఓటమి పాలయింది. ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించివంది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ తన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇద్దరి వికెట్ల భాగస్వామ్యం 75 పరుగులు కావడం విశేషం.
Next Story

