Sun Feb 01 2026 07:42:56 GMT+0000 (Coordinated Universal Time)
రోమాలు నిక్క బొడుచుకుంటాయా?
నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంి

నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలవాలని చెమటోడుస్తుంది. అలాగే బెంగళూరు జట్టు కూడా మరో విజయాన్ని తమ సొంతం చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. ఇరు బలంగా ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా సమ ఉజ్జీలు కావడంతో ఎవరిది గెలుపు అన్న ఉత్కంఠ చివరి బంతి వరకూ తేలక పోవచ్చన్న అంచనాల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పేలవమైన ప్రదర్శన...
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కొంత పేలవమైన ప్రదర్శన చేస్తుందనే చెప్పాలి. అది పంజుకుని తిరిగి ఫామ్లోకి రావాలని సూపర్ కింగ్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రధానంగా బౌలింగ్లో బలహీనంగా ఉండటం ఆ జట్టుకు మైనస్ పాయింట్ అని క్రీడా పండితులు చెబుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టు మాత్రం ఈ సీజన్లో కొంత మెరుగైన ప్రతిభను కనపరుస్తూ వస్తుంది. కొహ్లి, డూప్లిసెస్ ఫామ్లోకి రావడంతో కొంత ఊపు మీద ఉంది. మొత్తం మీద ఈరోజు మ్యాచ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందన్న అంచనా వినిపిస్తుంది.
Next Story

