Thu Mar 19 2026 21:23:33 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేటి మధ్యాహ్నం మరో కీలక మ్యాచ్
ఆదివారం నాడు ఐపీఎల్ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి

ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి బలంగానే కనిపిస్తున్నాయి.బౌలింగ్, బ్యాటింగ్ లలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను కనబరుస్తున్నాయి.
జోరుమీదుండటంతో...
ఇటీవల హైదరాబాద్ లోజరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసి రికార్డు నమోదు చేసింది. దీంతో ఈ జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. గేమ్ ప్లాన్ మార్చి ఈ పోరులో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరిది విజయం అన్నది మాత్రం చివర వరకూ తేలడం కష్టమేనన్నది క్రీడా నిపుణుల అంచనా.
Next Story

