Thu Mar 19 2026 19:39:03 GMT+0530 (India Standard Time)
IPL 2024 in Hyderabad: నేడు హైదరాబాద్ లో మ్యాచ్
నేడు ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL 2024 in Hyderabad:నేడు ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోయి గెలుపు కోసం పరితపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ పై ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ఓడిపోయింది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది.
రెండు జట్లు...
దీంతో రెండు జట్లు కసి మీద ఉన్నాయి. రెండు జట్లకు కొత్త కెప్టెన్లు సారథ్యం వహిస్తున్నారు. రెండు జట్లు బలంగా కనిపిస్తుండటంతో ఎవరిది గెలుపు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. హైదరాబాద్ లో మ్యాచ్ కోసం 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేడియానికి మూడు గంటల ముందు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ వంటి వాటిని అనుమతించరు.
Next Story

