Thu Mar 19 2026 18:03:20 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు హైదరాబాద్ కు కీలకమైన మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది

ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్ బెర్త్‌ల కోసం జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లకు ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. ఎక్కువ ఓటములు చెంది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లకు ప్లేఆఫ్ లో చోటు దక్కే అవకాశం లేనట్లే అనుకోవాలి. అందులో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు ఉన్నాయి. ఇవి ఎంత పోరాడినా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ జట్లు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని చెప్పాలి.
ముంబయి వేదికగా...
ఈరోజు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ముంబయి వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ ఇప్పటికే వరస ఓటములతో పూర్తిగా వెనకబడి ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ప్లే ఆఫ్ లో చోటు సంపాదించేందుకు ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత ఎగబాకి ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు శక్తివంచన లేకుండా సన్ రైజర్స్ శ్రమించాల్సి ఉంది.
Next Story

