Sun Mar 15 2026 18:01:43 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కే
ఈరోజు కోల్కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరకుంది. ఈరోజు ఫైనల్స్ కు తొలిగా ఏ జట్టు తేలనుందో తెలిసిపోతుంది. ఇప్పటి వరకూ లీగ్ మ్యాచ్ లను ఎంజాయ్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్ ఈరోజు మరో అదిరిపోయే మ్యాచ్ ను చూడబోతున్నారు. ఈరోజు గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్ కు చేరుకుంటుండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. బలమైన జట్లు నాలుగు ప్లేఆఫ్ దశకు చేరుకోవడంతో ఈ మ్యాచ్ పై అనేక ఆశలు పెట్టుకున్నారు. అనేక మంది భారీ గా బెట్టింగ్ లు కూడా కడుతున్నారు.
రెండు జట్లు బలంగానే...
ఈరోజు కోల్కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న జట్టు కోల్కత్తా నైట్ రైడర్స్ తో రెండో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ సీజన్ ప్రారంభం నుంచి మంచి పెర్ఫార్మెన్స్ తో ముందుకు దూసుకు వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ రోజు క్వాలిఫయిర్ మ్యాచ్ ఆడనుంది. దీంతో ఈ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది.
Next Story

