Sat Jan 31 2026 10:52:56 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు రాయల్ ఛాలెంజర్స్ కు డూ ఆర్ డై
ఈరోజు పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది

ఐపీఎల్ మ్యాచ్ లు 17వ సీజీన్ లో రసవత్తరంగా సాగుతున్నాయి. ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పుడు కొన్ని జట్లు ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు అవసరమైన పాయింట్లు అందుకోగా, మరికొన్ని ఇంకా మూడు, నాలుగు స్థానం కోసం ప్రయత్నిస్తున్నాయి. వరసగా మ్యాచ్ లు గెలిచి ప్లే ఆశలు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఒకటి. మొదట వైఫల్యాలతో ప్రారంభమైన ఆ జట్టు ప్రయాణం ఇటీవలే గాడిన పడింది.
ప్లే ఆఫ్ కోసం...
దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తాను కూడా ప్లే ఆఫ్ రేసులో ఉండేందుకు పోటీ పడుతుంది. ముంబయి ఇండియన్స్ ఇప్పటికే బరి నుంచి తప్పకోగా, పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈరోజు పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంటుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story

