Mon Mar 16 2026 11:03:33 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్
ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రెండు జట్లు బలమైన జట్లు

ఐపీఎల్ మ్యాచ్ లో చిన్న జట్లు, పెద్ద జట్లు అని కావు. మైదానంలో ఎవరిది పై చేయి అయితే వారిదే విజయం. అందుకే గెలుపు ఎవరిది అన్నది చివరి వరకూ ఊహించలేని పరిస్థితి. ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన అన్ని మ్యాచ్ లు అలాగే జరుగుతున్నాయి. కొన్ని మ్యాచ్ లలో రికార్డులు నమోదవుతున్నాయి. సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్స్ చేసి రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇలా మరెన్నో రికార్డులు ఈ ఐపీఎల్ లో చోటు చేసుకుంటున్నాయి. లక్నో లో ఈరోజు జరిగే ఈ మ్యాచ్ అందరినీ అలరించనుంది.
నేటి మ్యాచ్
ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రెండు జట్లు బలమైన జట్లు. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి పంజాబ్ జట్టు జోరు మీదుంది. లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి పాయింట్ల పట్టికలో ఎగబాకాలని పంజాబ్ కింగ్స్ ప్రయత్నిస్తుంది. అలాగే లక్నో కూడా పంజాబ్ ను ఓడించాలన్న కసితో ఉంది. బోణి కొట్టాలని ప్రయత్నిస్తుంది. రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగనుంది. అంచనాలు అందని ఈ మ్యాచ్ లో చివరికి గెలుపు ఎవరిది అన్నది తేలేంత వరకూ చెప్పలేని పరిస్థితి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story

