Mon Mar 16 2026 02:58:14 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు మరో సూపర్ మ్యాచ్
నేడు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది.

నేడు ముంబయికి ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే అన్ని జట్లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అందరూ ఫామ్ లో ఉండటంతో ఆ జట్టు ఫుల్లు జోష్ లో ఉంది.
ముఖ్యమైన మ్యాచ్...
అదే సమయంలో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లలో తడబడినా కొంత నిలదొక్కుకుంది. ప్లే ఆఫ్ స్థానం కోసం పోరాడుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే ముంబయి ఇండియన్స్ కు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. అందుకే నేటి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ కు కీలకంగా మారనుంది. మరి అంచనాలు మాత్రం రాయల్స్ వైపు ఉన్నాయి.
Next Story

