Thu Mar 19 2026 19:37:58 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు మరో సూపర్ మ్యాచ్
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది

ఐపీఎల్ లో మ్యాచ్ లు అంచనాలకు అందడం లేదు. వరసగా ఓటమి పాలవుతున్న జట్లు కూడా ఒక్కసారి తేరుకుని విజయం వైపు అడుగులు వేస్తున్నాయి. మ్యాచ్ పోయిందిలే అనుకోవడానికి లేదు. చివరి బంతి కూడా మ్యాచ్ లో గెలుపోటములను ఖరారు చేసేదిగా మారుతుంది. ప్రతి బంతి బ్యాటర్ కు వరంగా మారుతుంది. అదే సమయంలో ప్రత్యర్థికి శాపంగా మారుతుంది. ఇలా అనేక మ్యాచ్ లు విజయం సాధిస్తాయని భావించి, అంచనాలు వేసిన జట్లు కూడా ఓటమి బాట పట్టాయి.
ఢిల్లీ వేదికగా...
ఈరోజు మళ్లీ మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది. రెండు జట్లు ఐపీఎల్ ప్రారంభం నుంచి పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయాయి. అన్నీ వైఫల్యాలే. వరస అపజయాలే. అయితే రెండు జట్లు తేరుకుని విక్టరీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ జరిగే మ్యాచ్ కూడా ఉత్కంఠ రేపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు జట్లు సమఉజ్జీలుగా ఉండటంతో చివరి వరకూ గెలుపు ఎవరదన్నది నిర్ణయించడం కష్టమే మరి. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story

