Mon Mar 16 2026 04:27:32 GMT+0530 (India Standard Time)
IPL 2024 : ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్
ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ నేడు జరగనుంది

ఐపీఎల్ లో నేడు మరో కీలక పోరు జరగనుంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ నేడు జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నా పంజాబ్ కింగ్స్ దే కొంచెం పైచేయిగా కనిపిస్తుంది. పాయింట్ల పట్టికలో ముంబయి కంటే పంజాబ్ కొంత పరవాలేదనిపిస్తుంది.
ఇరు జట్లు...
ముంబయి జట్టు వరస ఓటములతో కుంగిపోయినా తర్వాత కోలుకుని తిరిగి పుంజుకుంది. ఈ పరిస్థితుల్లో నేడు జరిగే మ్యాచ్ అభిమానులను అలరించే అవకాశాలున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు బలంగానే ఉండటంతో స్కోరుతో పాటు వికెట్లను తీయడం పై కూడా అభిమానులు అంచనాలు భారీగానే ఉన్నాయి.
Next Story

