Mon Mar 16 2026 01:27:21 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు పంజాబ్‌కు డూ ఆర్ డై మ్యాచ్
ఈరోజు పంజాబ్ కింగ్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. కోల్కత్తా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది.

ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్ లో బెర్త్ కోసం ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో వెనక ఉన్న జట్లు ఇప్పుడు పోటీ పడే సమయం వచ్చింది. రానున్న మ్యాచ్ లన్నీ కీలకమే కావడంతో ఇప్పటి నుంచి జరిగే మ్యాచ్ లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న జట్లు పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే నేడు పంజాబ్ కింగ్స్ డూ ఆర్ డై మ్యాచ్ ను ఆడబోతుంది.
కోల్్కత్తాలో...
ఈరోజు పంజాబ్ కింగ్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. కోల్కత్తా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది. దానికి ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా పరవాలేదు. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం గెలిచి తీరాల్సిన మ్యాచ్. అందుకే పంజాబ్ కింగ్స్ జట్టు ఈరోజు పోరాడాల్సి ఉంటుంది.
Next Story

