Mon Mar 16 2026 04:25:19 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు ఢిల్లీ కాపిటల్స్ కు సవాల్
నేడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

ఐపీఎల్ లో మ్యాచ్‌లు అన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏ మ్యాచ్ కూడా బోరు కొట్టిన పరిస్థితి లేదు. మండు వేసవిలో క్రికెట్ ఫ్యాన్స్ ను ఐపీఎల్ సంతోషంగా ఉంచుతుంది. రికార్డులు బ్రేక్ లు అవుతున్నాయి. సిక్స్‌లు, ఫోర్లతో స్టేడియాలు మార్మోగుతున్నాయి. అలాంటి ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది.
రెండు జట్లు...
నేడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నప్పటికీ అది వేగంగా పుంజుకుంటుందని దాని అభిమానులు ఆశతో ఉన్నారు. అలాగే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుండటంతో చివరి వరకూ గెలుపు ఊగిసలాడక తప్పని పరిస్థితులు నెలకొంటాయన్నది క్రీడా నిపుణుల అంచనా
Next Story

