Thu Mar 19 2026 19:38:27 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు మళ్లీ రికార్డులు చెరిపేస్తారా?
ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తో తలపడనుంది.

IPL 2024 :ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ గత ఏ సీజన్ లో లేని విధంగా దూసుకుపోతుంది. తన రికార్డులను తానే బద్దలు కొడుతుంది. సన్ రైజర్స్ టీం ను ఆపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ప్రత్యర్థి టీం లు కూడా వారి బాదుడుకు చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకూ అత్యధిక స్కోర్లు నమోదు చేసిన సన్ రైజర్స్ ఈ రోజు ఎలాంటి రికార్డును నమోదు చేస్తుందన్నది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఉప్పల్ స్టేడియంలో...
ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే అచ్చి వచ్చిన ఉప్పల్ స్టేడియంలో మరోసారి దుమ్మురేపుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే సన్ రైజర్స్ ముందుగా బ్యాటింగ్ కు దిగితే ఇక కుమ్ముడే కుమ్ముడంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థిితి.
Next Story

