Sun Feb 01 2026 21:11:13 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : బెంగలూరుకు ఈ మ్యాచ్ కీలకమే
ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది

ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ప్లే ఆఫ్ కు వచ్చే జట్లు ఏవన్నది కొద్దిగా స్పష్టత వస్తుంది. వరస ఓటములతో ఇబ్బంది పడుతున్న జట్లు కొన్ని అయితే.. వరసగా గెలుస్తూ పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న జట్లు మరికొన్ని ఉన్నాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్లు దాదాపు ప్లే ఆఫ్ కు చేరినట్లేనని భావించాలి. మూడు, నాలుగు స్థానాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నిస్తున్నాయి.
రెండు జట్లు...
ఈరోజు మ్యాచ్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఈ సీజన్ లో పెద్దగా రాణించలేదు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో పోల్చుకుంటే టైటాన్స్ కొద్దిగా మెరుగైన పాయింట్లను సాధించింది. రెండు జట్ల పోరు ఆసక్తికరంగా సాగనుంది. కసి మీద ఉన్న రెండు జట్లు గెలుపు కోసం చివరి వరకూ పోరాటం చేయనుండటంతో ఫ్యాన్స్ కు ఒకింత ఈ మ్యాచ్ మంచి ఉత్కంఠను రేపుతుంది.
Next Story

