Fri Dec 05 2025 13:24:47 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : పిచ్చకొట్టుడు కొట్టుకున్న రోహిత్, పాండ్యా ఫ్యాన్స్
ముంబయి ఇండియన్స్ లో ఉన్న రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా అభిమానులు స్టేడియంలోనే కొట్టుకున్నారు

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించడంపై ఇప్పటికే అతడి ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. టీం ఇండియా కెప్టెన్ ను ఇలా అవమానపరుస్తారా? అంటూ రోహిత్ ఫ్యాన్స్ ముంబయి ఇండియన్స్ యాజమాన్యంపై మాటల దాడికి దిగుతున్నారు. చివరకు నిన్న జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ బాగా ఆడి తన జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ హార్ధిక్ పాండ్యా ఓవర్ యాక్షన్ చేసి మ్యాచ్ చేజార్చాడంటూ రోహిత్ ఫ్యాన్స్ అనడంతో ఇద్దరి అభిమానుల మధ్య స్టేడియంలోనే కొట్లాట జరిగింది.
ఓవర్ యాక్షన్ చేశారంటూ...
నిన్న జరిగిన గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ పాండ్యా తొలి ఓవర్ వేయడం ఓవర్ యాక్షన్ అంటున్నారు బుమ్రా ఉండగా పాండ్యా బౌలింగ్ చేయాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే చివరిగా దిగి జట్టును గెలిపించాలనుకున్న పాండ్యా ప్రయత్నం కూడా విఫలమయింది. దీంతో మాట మాట పెరిగి స్టేడియంలో రోహిత్ ఫ్యాన్స్, పాండ్యా అభిమానులు కొట్టుకున్నారు. మ్యాచ్ ఓటమికి కారణం పాండ్యానేనంటూ రోహిత్ అభిమానుల చేసిన వ్యాఖ్య ఈ గొడవకు కారణమని చెబుతున్నారు. ఈకొట్లాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story

