Sun Mar 15 2026 22:06:39 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు మరో సూపర్ మ్యాచ్
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ నేడు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.

నేడు ఐపీఎల్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి మ్యాచ్ అలరించనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ నేడు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. అలాగే చెన్నై మాత్రం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్ లో కొనసాగాలంటే చెన్నై కూడా ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన పరిస్థితి.
వరస ఓటములతో...
పంజాబ్ కింగ్స్ మాత్రం వరస ఓటములతో డీలా పడిపోయింది. అది ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. అయినా గెలుపు కోసం ప్రయత్నిస్తుంది కాబట్టి చెన్నై జట్టు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో రాణించాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకునే జట్లపై ఒక క్లారిటీ వస్తుండటంతో నేట ిమ్యాచ్ రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగనుంది.
Next Story

