Thu Mar 19 2026 12:14:06 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు మరో కీలక మ్యాచ్
నేడు ఐపీఎల్ లో మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది

నేడు ఐపీఎల్ లో మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. రెండు జట్లు కొత్త కెప్టెన్ల తో ఈ సీజన్ లోకి బరిలోకి దిగాయి. ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. రెండు జట్లు ఇప్పటికే ఒక విజయాన్ని నమోదు చేసుకున్నాయి. దీంతో ఇరు జట్ల ఫ్యాన్స్ ఈ మ్యాచ్ లో మంచి ఆటను ఆస్వాదించనున్నాయి.
ఇరు జట్లు బలంగా...
చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై గెలిచి సత్తా చాటింది. గుజరాత్ టైటాన్స్ ముంబయి ఇండియన్స్ ను ఓడించి జోరు మీదుంది. రెండు జట్లు గెలుపుతో ఊపు మీదుండటంతో ఈ మ్యాచ్ లో ఎవరిది గెలుపు అన్నది ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ టైటాన్స్ కు శుభమన్ గిల్ కెప్టెన్లుగా ఉన్నారు. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు చెన్నైలో ప్రారంభం కానుంది.
Next Story

