Mon Mar 16 2026 05:59:37 GMT+0530 (India Standard Time)
IPl 2024 : నేడు దిగ్గజ టీంల మధ్య మ్యాచ్
ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ తో నేడు బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది

ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ తో నేడు బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ముంబయి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో ఇరు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు జట్లకు ఈ మ్యాచ్ లో గెలుపు అవసరం ఎక్కువగా ఉంది.
రెండు జట్లు...
ముంబయి జట్టు ఇప్పటి వరకూ ఒక మ్యాచ్ లో గెలిచింది. అలాగే బెంగళూరు జట్టు కూడా అదే పరిస్థితుల్లో ఉంది. రెండు జట్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుండటంతో ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందన్నది అంచనాలకు అందకుండా ఉంది. సొంత మైదానం కావడంతో తమకు అనుకూలమని ముంబయి ఇండియన్స్ అంటుండగా, తాము గెలిచి తీరతామాని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు పట్టుదలతో ఉంది.
Next Story

