Sun Mar 15 2026 22:12:04 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు హేమాహేమీల పోరు
ఈరోజు మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది.

ఐపీఎల్లో మ్యాచ్‌లన్నీ ఈసారి అంచనాలకు ఎవరికీ అందడం లేదు. గెలుస్తుందని భావించిన జట్టు ఓటమి పాలవుతుంది. అదే పెద్దగా పెర్ఫార్మెన్స్ లేని జట్టు ఉన్నట్లుండి విజయం బాట పడుతుంది. ఇలా ఈసారి ఐపీఎల్ సీజన్ ఎండింగ్ వచ్చేసరికి అనేక రకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగే ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్ కోసమే పోరాటం చేస్తున్నాయి. ప్లే ఆఫ్ లో అర్హత సంపాదించేది కేవలం నాలుగు జట్లు మాత్రమే కావడంతో ఆ స్థానం కోసం ప్రతి జట్టు ప్రయత్నిస్తుంది. మరోవైపు ప్లే ఆఫ్ ఆశలు లేకపోయినా రానున్న టీ 20 వరల్డ్ కప్ కు దీనిని ప్రాక్టీస్ గా చూస్తున్న ఆటగాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఈరోజు మ్యాచ్ లో...
ఈరోజు మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ దాదాపు ప్లే ఆఫ్ కు చేరుకున్నట్లే. రెండు మ్యాచ్ లు మినహా ఆడిన అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. సన్ రైజర్స్ మాత్రం తొలినాళ్లలో కొంత తడబాటు పడినా తర్వాత తేరుకుంది. కానీ గత రెండు మ్యాచ్ లు ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ ను సొంత మైదానంలో ఎలాగైనా గెలవాలని హైదరాబాద్ భావిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ ఇంట్రస్టింగ్ గా సాగనుంది.
Next Story

