Thu Jan 29 2026 12:13:24 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఢిల్లీ కాపిటల్స్ కు చావో రేవో
ఈరోజు మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్లు తలపడుతుంది

ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. అన్ని జట్లు ప్లే ఆఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లే ఆఫ్ కు కొన్ని జట్లు ఇప్పటికే ఆశలు కోల్పోయాయి. మరికొన్నిజట్లు మాత్రం ప్లే ఆఫ్ కు చేరుకోవడం ఖాయమయింది. సీజన్ దగ్గర పడే కొద్దీ తొలి రోజుల్లో పేలవంగా ఆడిన జట్లు పుంజుకుని తిరిగి ఫామ్ లోకి వచ్చాయి. అయితే అప్పటికే ఆలస్యమయింది. పాయింట్ల పట్టికలో తక్కువ స్థానంలో ఉండటంతో పాటు పాయింట్లు కూడా తక్కువగా ఉండటంతో ప్లే ఆఫ్ చేరుకోవడం చాలా క్లిష్టతరం చేసుకున్నాయి.
ఢిల్లీతో రాజస్థాన్...
ఈరోజు మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్లు తలపడుతుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు తొలి నాళ్లలో విఫలమయినా తర్వాత తేరుకున్నప్పటికీ ప్లేఆఫ్ కోసం అన్ని మ్యాచ్ లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి మంచి పెర్ ఫార్మెన్స్ చూపిస్తూ పాయింట్ల పట్టికలో ఆధిక్యతను కొనసాగిస్తూ వస్తోంది. ఈరోజు మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.
Next Story

