Thu Mar 19 2026 10:08:26 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు ఛాలెంజర్స్ కు చావోరేవో
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది

నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు ముఖ్యమైనది. వరస ఓటములతో నిరాశలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ రేసులో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంది.
జైపూర్ వేదికగా...
కీలక ఆటగాళ్లు బ్యాటింగ్ లో, బౌలర్లలో విఫలమవుతుండటంతో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింటిలో ఓటమి పాలయింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వరస గెలుపులతో ఊపు మీదుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
Next Story

