Fri Dec 05 2025 16:00:24 GMT+0000 (Coordinated Universal Time)
బీచ్ లో నగ్నంగా యువతి మొండెం.. అసలు విషయం తెలిసి ఊపిరిపీల్చుకున్న పోలీసులు
అర్థనగ్నంగా పడిఉన్న మృతదేహాన్ని చూసి రేప్, మర్డర్, పోస్టుమార్టమ్ అని ఏవేవో ఆలోచించి కేసు నమోదు చేసుకున్నారు. ఆ మొండేనికి

సముద్ర తీరాన సాయం సంధ్యవేళ ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి తీరం పర్యాటకులతో కళకళలాడుతోంది. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సంద్రంలో జలకాలాడుతున్నారు. అంతా బాగానే ఉన్న సమయంలో ఉన్నట్లుండి అలజడి రేగింది. అక్కడ కనిపించిన ఘటన చూసిన పిల్లలు బెంబేలెత్తిపోయారు. అసలు విషయం తెలిశాక ఊపిరిపీల్చుకున్నారు. తల లేని యువతి మొండెం అర్థనగ్నంగా సముద్రతీరాన కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
అర్థనగ్నంగా పడిఉన్న మృతదేహాన్ని చూసి రేప్, మర్డర్, పోస్టుమార్టమ్ అని ఏవేవో ఆలోచించి కేసు నమోదు చేసుకున్నారు. ఆ మొండేనికి సంబంధించిన తల కోసం సముద్రతీరంలో వెతకడం మొదలు పెట్టారు. ఇంతలో అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన థాయ్ ల్యాండ్ లో జరిగింది. ఒక వ్యక్తి తనవద్దనున్న బొమ్మ ఇక పనికి రాదని భావించి దానిని బీచ్ ఒడ్డున పడేశాడు. అది తలలేకుండా నీళ్లలో తీరానికి మొండెం కొట్టుకొచ్చింది. ఇంతలో దాన్ని చూసిన అక్కడి జనం భయపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశాక.. రంగంలోకిి దిగిన పోలీసులు మొండెం తలకోసం వెతికారు.
ఆ తలను చూసి పోలీసులు షాకయ్యారు. అది అసలు మనిషి కాదని, బొమ్మ అని తెలుసుకున్నారు. జపాన్ కు చెందిన ఈ బొమ్మ విలువ రూ.45 వేలు ఉంటుందని అంచనా. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

