Fri Dec 05 2025 12:01:31 GMT+0000 (Coordinated Universal Time)
పడవబోల్తా.. 103 మంది మృతి
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వారా రాష్ట్ర రాజధాని ఇలోరిన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటేగి జిల్లాలో

పెళ్లి బృందంలో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 103 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన దక్షిణాఫ్రికాలోని నైజీరియాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వారా రాష్ట్ర రాజధాని ఇలోరిన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటేగి జిల్లాలో వివాహానికి హాజరైన ఓ పెళ్లి బృందం తిరుగు పయనమైంది. పెళ్లిబృందంతో నైజర్ నదిపై వస్తున్న పడవ బోల్తాపడటంతో నదిలో మునిగి 103 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
ప్రమాదంలో మరో 100 మందిని రక్షించారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 300 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పరిమితికి మించి పడవ ఎక్కడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గల్లంతైన వారికోసం రెస్క్యూ టీమ్ లు గాలిస్తున్నాయి.
Next Story

