Fri Dec 05 2025 11:40:26 GMT+0000 (Coordinated Universal Time)
Israel and Iran War : ఇజ్రాయిల్ దాడి వ్యూహాత్మకంగానే జరిగిందా? కీలక భూమిక పోషించిందెవరంటే?
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 78 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడిలో 320 మంది గాయాల పాలయ్యారని చెబుతున్నారు. ఇజ్రాయిల్ దాదాపు రెండు వందల యుద్ధ విమానాలతో.. 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు దిగడంతో ఇరాన్ లోని పలు స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్ లో ఉన్న అణు స్థావరాలు, సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ ఇప్పటికే ప్రకటించింది. ఒకరకంగా భారత్ పాకిస్థాన్ ఉగ్రవాద స్ధావరాలపై దాడులు జరిపినట్లుగా ఇజ్రాయిల్ కూడా ఇరాన్ లోని సైనిక స్థావరాలు, అణుస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లుంది.
అనేక చోట్ల పేలుళ్లు...
ఇరాన్ భూభాగంలో డ్రోన్లతో దాడి చేయడంతో డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతిదాడికి దిగింది. టెల్అవీన్, జెరూసలేంలో పలుచోట్ల పేలుళ్లు జరుగుతున్నాయి. ఇరాన్ అణు ఒప్పందానికి రాకుంటే తీవ్ర దాడులు తప్పవని ట్రంప్ చేసిన హెచ్చరికలు కూడా లెక్క పెట్టడం లేదు. ఇజ్రాయిలో ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేయడానికి అనేక రోజుల నుంచి వ్యూహాలు రచించి అకస్మాత్తుగా దాడులకు దిగింది. ఇరాన్ అణు పరీక్షలు తమ కోసమేనని భావించిన ఇజ్రాయిల్ ఇరాన్ ను ఎదుర్కొనాలంటే ముందుగా అణు కేంద్రాలను, సైనిక శిబిరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇజ్రాయిల్ గూఢాచారి విభాగం మోస్సాద్ కీలక భూమిక పోషించిందని చెబుతున్నారు.
సమీపంలోనే డ్రోన్ శిబిరంతో...
ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు సమీపంలోనే ఇజ్రాయిల్ డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నా ఇరాన్ గుర్తించలేకపోయింది. ముందుగా అణు స్థావరాలను గుర్తించి వాటిని నాశనం చేయాలన్న లక్ష్యంతో వాటిపై గురిపెట్టింది. ఇరాన్ సైనిక శిబిరాలను నేలమట్టం చేసి మానసికంగా కూడా నష్టం చేకూర్చాలని ఇజ్రాయిల్ వేసిన ప్లాన్ ఫలించినట్లే కనపడుుతుంది. ఊహించని విధంగా ఇజ్రాయిల్ దాడులకు దిగడంతో ఇరాన్ తేరుకునే లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ప్రతీకార దాడులుకు ఇరాన్ దిగినప్పటికీ అప్పటికే ఇజ్రాయిల్ సిద్ధంగా ఉండటంతో ఇరాన్ పంపిన డ్రోన్లను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది ఎవరీకీ అంతుబట్టకుండా ఉంది. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్ పై పడుతుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
Next Story

