Fri Dec 05 2025 09:34:56 GMT+0000 (Coordinated Universal Time)
Iran and Israel War : తీవ్రమైన ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం - బీతావహ వాతావరణం
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమయింది. ఒక దేశంపై మరొక దేశం దాడులు, ప్రతి దాడులకు దిగుతున్నాయి

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమయింది. ఒక దేశంపై మరొక దేశం దాడులు, ప్రతి దాడులకు దిగుతుండటంతో భారీగా ఆస్తి నష్టం సంభవవించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అనేక నివాస భవనాలు నేలమట్టం కావడంతో పాటు ప్రధానమైన అణుకేంద్రాలను, సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడులకు దిగడంతో పాటు ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పై క్షిపణులతో దాడులకు దిగుతుండటంతో బీతావహ వాతావరణం నెలకొంది.
టెహ్రాన్ ఖాళీ కావడంతో...
ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం దాదాపు ఖాళీ అయినట్లు కనిపించింది. ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులకు దిగుతుండగా, ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో దాడులకు దిగడంతో యుద్ధం ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడికి దిగడంతో పాటు వాళ్ల హైపర్ సోనిక్ క్షిపణులను అడ్డగించింది. ఇజ్రాయిల్ కు చెందిన బలమైన ఎయిర్ డిఫెన్స్ ఇన్ కమింగ్ ఇరాన్ క్షిపణులను అడ్డుకోగలిగిందంటున్నారు. అయితే హైపర్ సోనిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ లోని పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.
అమెరికా కూడా చేరితే...
పశ్చిమాసియాలో యుద్ధం పీక్స్ కు చేరుకోవడంతో పాటు ఇప్పుడు తాజాగా అమెరికా కూడా పాల్గొనాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ పై దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే యుద్ధం మరింత పెరిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ సమాజంలో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇది అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ ఇరాన్ పై దాడులు నిర్వహించేందుకు అమెరికా సిద్ధమయితే మాత్రం యుద్ధం తారా స్థాయికి చేరుకుంటుంది. అరవై యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్ ఇరాన్ లోని అణ్వాయుధాల కేంద్రాలపై దాడులకు దిగుతోంది.ఇరాన్ వైపు నుంచి ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్ వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశ పౌరులను ఇజ్రాయిల్ ఇప్పటికే కోరింది.
Next Story

