Sat Jul 12 2025 13:17:36 GMT+0000 (Coordinated Universal Time)
Israel Iran War : ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య పదిరోజులుగా వార్.. అమెరికా ఎంట్రీతో
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య వార్ కొనసాగుతుంది. పదిరోజుల యుద్ధం విషాదాన్ని మిగిల్చింది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య వార్ కొనసాగుతుంది. పదిరోజుల యుద్ధం విషాదాన్ని మిగిల్చింది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇక భారీగా రెండు దేశాల ఆస్తినష్టం జరిగింది. అయినా ఇరాన్ వెనకడుగు వేయడం లేదు. ఇజ్రాయిల్ తగ్గడం లేదు. దీనికి తోడు యుద్ధంలో ఇప్పుడు అమెరికా ప్రవేశించడంతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేక మరింత తీవ్రమవుతుందా? అన్నది తేలకుండా ఉంది. జెనీవాలో యుద్ధ విరమణకు సంబంధించిన చర్చలు ప్రారంభమయినా దాడులు మాత్రం వేటికవే కొనసాగిస్తూ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా తన యుద్ధ విమానాలను పంపింది.
ట్రంప్ ప్రకటనతో...
ఇరాన్ లోని అణుస్థావరాలపై దాడులు చేశామని, వాటిని ధ్వంసం చేసిన అనంతరం తిరిగి సేఫ్ గా తమ దేశానికి విమానాలు వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ లో ప్రకటించారు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న మిలటరీకి ఇలాంటిది సాధ్యపడదని తనకు తాను ప్రశంసించుకున్నారు. అమెరికా సైనికులకు అభినందనలు తెలిపారు. ఇరాన్ దిగి రావాల్సిందేనని, అణ్వాయుధాల పరీక్షలకు, ప్రయోగానికి తాము వ్యతిరకేమని అందుకే ఇజ్రాయిల్ కు అండగా నిలిచామని అమెరికా చెబుతుంది. ఇరు దేశాలు యుద్ధానికి స్వస్తి చెప్పి పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాలని ట్రంప్ కోరినప్పటికీ అమెరికా కూడా తోడవ్వడంతో ఇరాన్ ఎలాంటి ప్రతి చర్యలకు దిగుతుందన్నది చూడాల్సి ఉంది.
అత్యంత శక్తిమంతమైన...
అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై దాడులు నిర్వహించి వాటిని ధ్వంసం చేశాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.ట్రంప్ ఇరాన్ కు పది రోజులు సమయం ఇచ్చి రెండు రోజుల్లోనే యుద్ధానికి దిగాడని మీడియా తెలిపింది. ట్రంప్ తొలి నుంచి ఇజ్రాయిల్ అనుకూల వైఖరిని వ్యవహరిస్తుండటంతో అయితే అమెరికాయే దాడులకు దిగడంతో ఆ సస్పెన్స్ కు తెరపడింది. అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై B -2 బాంబర్లను ప్రయోగించినట్లు తెలిసింది. ఇవి అత్యంత శక్తిమంతవి కావడంతో బంకర్లు, సొరంగాల్లోకి కూడా చొచ్చుకెళతాయి. ఇప్పటి వరకూ ఇజ్రాయిల్ దాడుల్లో 430 మంది ఇరాన్ ప్రజలు మరణించారు. యుద్ధం కొనసాగుతుందా? ఆగుతుందా? అన్నది సస్పెన్స్ గానే ఉంది.
Next Story