Mon Jan 05 2026 10:01:10 GMT+0000 (Coordinated Universal Time)
Venezuela : అరెస్ట్ తర్వాత మదురో నోటి నుంచి వచ్చిన మాటలివే
అమెరికా అరెస్ట్ చేసిన తర్వాత వెనిజులా అధ్యక్షుడు మదురో తొలిసారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

అమెరికా అరెస్ట్ చేసిన తర్వాత వెనిజులా అధ్యక్షుడు మదురో తొలిసారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూ యార్క్ లోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఆయన అధికారులను 'గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్' అంటూ విష్ చేశారు. థంబ్స్ అప్ చూపిస్తూ నవ్వుకుంటూ దిగిన ఫొటో కూడా వైరలవుతోంది. ప్రస్తుతం మదురో, ఆయన భార్య డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కస్టడీలో ఉన్నారు. వారిని న్యూయార్క్ జైలులో ఉంచనున్నట్లు సమాచారం.
తాత్కాలిక అధ్యక్షురాలిగా ...
అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రి బాధ్యతలు చేపట్టాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో పాలన సజావుగా సాగడానికి, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అస్థిరత తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు మదురోపై నార్కో టెర్రరిజం నేరాల కింద కేసు నమోదు చేసి విచారణ జరపనున్నారు. వెనిజులా విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని US మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా తప్పుబట్టారు.
మదురో అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ...
మదురో డిక్టేటర్ అయినప్పటికీ ట్రంప్ చర్య చట్టవిరుద్ధమని, ఇది అమెరికాను సురక్షితంగా మార్చలేదని విమర్శించారు. కేవలం ఆయిల్ కోసం సైనికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేని ఇలాంటి చర్యల వల్ల చివరకు సామాన్య అమెరికన్ కుటుంబాలే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేవలం వెనిజులాలో ఉన్న ఆయిల్ నిల్వల కోసమే ఈ యుద్ధానికి తెరతీశారని, వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్ పై సొంత దేశంలోనే అనేక మంది విమర్శలు చేస్తుండటం విశేషం.
Next Story

