Mon Jan 05 2026 04:32:39 GMT+0000 (Coordinated Universal Time)
Venezuela : బెడ్రూం నుంచి ఇద్దర్నీ లాక్కెళ్లారు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, భార్య సిలియాను అమెరికా బలగాలు అర్ధరాత్రి అరెస్టు చేశాయి.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, భార్య సిలియాను అమెరికా బలగాలు అర్ధరాత్రి అరెస్టు చేశాయి. కరాకాస్ లోని సైనిక స్థావరంలో గల ఇంట్లో నిద్రిస్తుండగా దాడి చేసిన డెల్టా ఫోర్సెస్ టీమ్ బెడ్రూం నుంచి లాక్కెళ్లిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ముప్ఫయి నిమిషాల్లో దాడి, వారి తరలింపు పూర్తయిందని వెల్లడించాయి. సమీప పోర్టులోని అమెరికా యుద్ధనౌక ఐవో జిమాలోకి వారిని ఎక్కించి అక్కడి నుంచి యుద్ధ విమానాల్లో న్యూ యార్క్ కు తరలించారు.
40 మంది మృతి...
వెనిజులాపై నిన్న అమెరికా చేసిన మెరుపుదాడుల్లో 40మంది మృతి చెందినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చనిపోయిన వారిలో సాధారణ పౌరులతో పాటు సైనికులున్నట్లు తెలిపింది. మరోవైపు అమెరికా బలగాలు వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అమెరికాకు తరలించాయి.. వీరిని అక్కడి మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ (MDC)కు తరలించే అవకాశముంది.
Next Story

