Sat Dec 13 2025 22:33:52 GMT+0000 (Coordinated Universal Time)
మరో బాంబు పేల్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. షుగర్, ఒబెసిటీ ఉన్నోళ్లకు అమెరికా వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. షుగర్, ఒబెసిటీ ఉన్నోళ్లకు అమెరికా వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు వీసా నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. వెంటనే ఈ నిబంధనలు అమలు చేయాలని ఎంబసీలు, కాన్యులర్ కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. డయాబెటీస్, గుండె జబ్బులతో ఉన్న విదేశీయులకు వీసాలు నిరాకరిస్తూ అమెరికా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
షుగర్ ఉంటే నో వీసా...
అమెరికాకు వలస రావాలనుకునే విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో భాగంగా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి వీసాలు, గ్రీన్‌కార్డులు ఇవ్వడం కుదరదు. కొత్త ఆదేశాలు ప్రకారం “పబ్లిక్ చార్జ్” గా పరిగణించే వర్గాలను విస్తరించారు. ఈ మార్గదర్శకాలను అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలకు పంపించింది.
Next Story

